నాని చెల్లెలి పాత్ర‌లో మిస్ ఇండియా..!

Wed,February 6, 2019 09:14 AM
Indian Model Play Nanis sister

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌లో ఓ మూవీ తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ఐదుగురు క‌థానాయిక‌లు నటించ‌నున్నారు. వారిలో కీర్తి సురేష్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్, మేఘా ఆకాశ్‌ల పేర్లు బ‌య‌ట‌కి రాగా, మ‌రో ఇద్ద‌రు ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది. ఫిబ్ర‌వరి 19 నుండి సెట్స్ పైకివెళ్ళ‌నున్న ఈ చిత్రం హాలీవుడ్ మూవీ ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మిన్ బ‌ట‌న్ లైన్‌ని బేస్ చేసుకొని రూపొంద‌నుంద‌ట‌. చిత్రంలో ఒక మ‌నిషి జీవితం యొక్క నాలుగు వేర్వేరు ద‌శ‌ల‌ని చూపించ‌నున్నార‌ని అంటున్నారు. నాని 19 ఏళ్ళ టీనేజ‌ర్‌గాను , 25 ఏళ్ళ యువ‌కుడిగాను, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న మ‌ధ్య వ‌య‌స్కుడిగాను క‌నిపిస్తార‌ట‌. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో 2002 మిస్ ఇండియా శృతి శ‌ర్మ .. నాని చెల్లెలి పాత్ర‌లో క‌నిపించేందుకు సిద్ధ‌మైంద‌ట‌. త‌న పాత్ర‌కి మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని భావించిన శృతి శ‌ర్మ చెల్లెలి పాత్ర‌కి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఈ చిత్రం నానికి మంచి హిట్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

2373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles