రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్‌లో ప్ర‌ద‌ర్శన జ‌రుపుకున్న బాహుబ‌లి

Sun,October 20, 2019 09:07 AM

ఒక‌ప్పుడు తెలుగు సినిమా చ‌రిత్ర గురించి మాట్లాడుకోవ‌ల‌సి వ‌స్తే శివ‌కి ముందు శివ త‌ర్వాత అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు బాహుబలికి ముందు బాహుబ‌లి త‌ర్వాత అని అంటున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన బాహుబ‌లి చిత్రం గురించి ఎంత చెప్పిన త‌క్కువ‌నే. ఈ సినిమా మొద‌టి భాగాన్ని లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆల్బర్ట్ హాల్‌లో శ‌నివారం ప్ర‌ద‌ర్శించారు . హాలీవుడ్ సినిమాలు కాకుండా.. రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మైన‌ తొలి తెలుగు చిత్ర‌మిది. ఇది తెలుగు సినిమాకు ద‌క్కిన గౌర‌వంగా చెప్పవ‌చ్చు. ఈ సంద‌ర్భంగా బాహుబ‌లి మెయిన్ టీమ్ ప్ర‌భాస్‌, అనుష్క‌, రాజ‌మౌళి,రానా, శోభు యార్ల‌గ‌డ్డ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సినిమా ప్ర‌ద‌ర్శనకి ముందు చిత్ర బృందం సినిమాకి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌స్తావించారు. రాజ‌మౌళి పంచెక‌ట్టులో ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం విశేషం. ఈ వేదిక మీద సంగీత దర్శకుడు కీరవాణి బాహుబలి నేపథ్య సంగీతాన్ని లైవ్‌లో పర్‌ఫార్మ్ చేసిన‌ట్టు తెలుస్తుంది .966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles