మ‌ల్టీ స్టార‌ర్ చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్‌..!

Sun,March 31, 2019 08:33 AM
interesting title for multi starrer

నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఓ మ‌ల్టీ స్టారర్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, ప్రాజెక్ట్‌కి సంబంధించి పలు వార్తలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇటీవ‌ల ఈ మూవీలో క‌థానాయిక‌గా నాని స‌ర‌స‌న అదితిరావుని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, నాని ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని అన్నారు. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది లేదా మణిశర్మల‌లో ఒకరిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయ‌నున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కథా పరంగా 'వ్యూహం' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. ప్ర‌స్తుతం జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు నేచుర‌ల్ స్టార్. ఈ చిత్రాన్ని మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నాడు. మ‌రోవైపు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా 2019లోనే విడుద‌ల కానుంది. అయితే త‌నని అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేసిన ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాని సినిమా చేస్తుండ‌డంతో అంచ‌నాలు పెరుగుతున్నాయి. కాగా, ఇటీవల సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి చేసిన సమ్మోహనం భారీ విజయాన్ని నమోదు చేసిన విష‌యం విదిత‌మే

2377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles