తేజూ సోద‌రుడి మూవీకి ఆస‌క్తిక‌ర టైటిల్‌

Sun,May 5, 2019 11:41 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్.. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప‌లు టైటిల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ మ‌ధ్య జాల‌రి అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌ర‌గ‌గా, తాజాగా ఉప్పెన అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్ర టైటిల్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మూవీలో కథానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేశారో కూడా తెలియాల్సి ఉంది.

2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles