'ఆర్ఆర్ఆర్' అప్‌డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్

Sat,March 9, 2019 10:05 AM
Interesting Update About RRR By Music Director M.M Keeravani

బాహుబ‌లి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కించి ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే . ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్ర సెకండ్ షెడ్యూల్ జ‌రుగుతుంది. దీని త‌ర్వాత మ‌రో షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్ళ‌నుంది చిత్ర యూనిట్‌. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి వార్త‌లు కాని, పోస్ట‌ర్స్ కాని బ‌య‌ట‌కి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్న జ‌క్క‌న్న మూవీ ఫ‌స్ట్ లుక్‌ని రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే ( మార్చి 27) రోజున విడుద‌ల చేయ‌నున్నార‌ని అంటున్నారు. బాహుబ‌లి చిత్రం స‌మ‌యంలో కూడా రాజ‌మౌళి ఆర్టిస్టుల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోస్ట‌ర్స్ విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి ఆర్ఆర్ఆర్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయ‌ని త‌న ట్వీట్‌లో తెలిపారు.

భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అలియా భ‌ట్ , ప‌రిణితి చోప్రా క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండగా , బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాలో చరణ్ బ్రిటీష్‌ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడ‌ని టాక్. 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.2643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles