నిహారిక 'మ్యాడ్ హౌజ్' ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో

Sun,September 22, 2019 12:45 PM

ముద్ద‌పప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో నిహారిక వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించగా, త‌న తండ్రితో క‌లిసి పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేసింది. ఇక తాజాగా మ్యాడ్ హౌజ్ పేరుతో కామెడీ సిరీస్ రూపొందిస్తుంది. తెలుగులో తొలి సారి 100 ఎపిసోడ్ల కామెడీ సిరీస్‌గా ఈ కార్య‌క్ర‌మం ఉండ‌నుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌పై నిహారిక నిర్మించ‌నున్న మ్యాడ్ హౌస్ సిరీస్‌కి సంబంధించి ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో విడుద‌లైంది. ఇందులో.. సిరీస్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యంపై కాస్త క్లారిటీ ఇచ్చారు. ఇద్ద‌రు అబ్బాయిలు, ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య ఫ‌న్నీగా ఉండే ఈ సిరీస్ ఆద్యంతం ఆడియ‌న్స్‌ని క‌ట్టిప‌డేస్తుంద‌ని చెప్పుకొచ్చారు . ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకంగా కథ‌ ఉండబోతుందట‌. అక్టోబ‌ర్‌లో ఈ సిరీస్ ప్ర‌సారం కానుంది. మ‌హేష్ ఉప్ప‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా నిహారిక ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్‌, సూర్య‌కాంతం వంటి చిత్రాల‌తో వెండితెరపై ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. నిహారిక .. సైరా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 2న చిత్రం విడుద‌ల కానుంది.




1958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles