HomeLATEST NEWSINTTELLIGENT movie first look released

మెగా హీరో మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Published: Tue,January 23, 2018 08:57 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ఆ మధ్య విడుదలైన జవాన్ చిత్రంతో అభిమానులని కాస్త నిరాశపరచిన సాయిధరమ్ తేజ్ త్వరలో ఇంటిలిజెంట్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదల చేశారు. ఇందులో సగం మొహాన్ని ఇంటిలిజెంట్ అనే అక్షరాలతో కవర్ చేసేసి.. కాస్త మ్యాట్రిక్స్ తరహా ఫీల్ తెచ్చేందుకు ప్రయత్నం చేశారు మేకర్స్ . వినాయక్ సినిమా అంటే పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఉంటుంది కాబట్టి , ఈ మూవీ కూడా ప్రేక్షకులకి మంచి వినోదం అందించనుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిధరమ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రంకి సంబంధించి ప్రస్తుతం పబ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది. జనవరి 25తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
2305
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology