బాలయ్య చేతుల మీదుగా మెగా హీరో మూవీ టీజర్ విడుదల

Sat,January 27, 2018 10:54 AM
INTTELLIGENT teaser released by bala krishna

నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇంటిలిజెంట్ చిత్ర టీజర్ కొద్ది గంటలలో విడుదల కానుంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ మూవీ తెరకెక్కగా సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల బాలయ్య ప్రధాన పాత్రలో విడుదలైన జై సింహా చిత్రానికి కూడా కళ్యాణ్ నిర్మాతగా ఉన్నారు. ఈ కనెక్షన్ తోనే ఇంటిలిజెంట్ చిత్ర టీజర్ బాలయ్యతో విడుదల చేయించాలని మూవీ టీం భావించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకి టీజర్ ని విడుదల చేయనున్నారు. ఇటీవల ఇంటిలిజెంట్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో సగం మొహాన్ని ఇంటిలిజెంట్ అనే అక్షరాలతో కవర్ చేసేసి.. కాస్త మ్యాట్రిక్స్ తరహా ఫీల్ తెచ్చేందుకు ప్రయత్నం చేశారు మేకర్స్ . ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిధరమ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ అటు సాయి ధరమ్ కి, ఇటు వినాయక్, లావణ్య త్రిపాఠిల కెరియర్ కి అవసరం కానుంది

2427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles