HomeLATEST NEWSIrrfan Khan Posts A Heartfelt Note

నాకు అండ‌గా నిలిచిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు: ఇర్ఫాన్

Published: Wed,April 3, 2019 01:09 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌కి 2018 మార్చిలో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ సోకినట్లు తెలిసింది. దాని కంటే నాలుగు నెలల ముందే అరుదైన క్యాన్సర్ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయ‌న‌ ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లారు. ట్రీట్‌మెంట్ మధ్యలో రెండుమూడు సార్లు ఇండియాకు వచ్చి వెళ్లారు ఇర్ఫాన్. ట్రీట్‌మెంట్ మొత్తం పూర్తయ్యాక ఆయన ఫిబ్రవరి 2019లో ఇండియాకు తిరిగొచ్చారు. అయితే ఈ మ‌ధ్య ఇర్ఫాన్ మాస్క్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించారు. కాని మంగ‌ళ‌వారం ఆయ‌న ముంబై ఎయిర్ పోర్ట్‌లో మాస్క్ లేకుండా క‌నిపించ‌డంతో ఫోటోగ్రాఫ‌ర్స్ ఆయ‌న‌ని త‌మ కెమెరాలో బంధించారు. ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్న ఇర్ఫాన్‌ని చూసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఇక కొద్ది సేప‌టి క్రితం ఇర్ఫాన్ త‌న ట్విట్ట‌ర్‌లో ఎమోష‌నల్ పోస్ట్ కూడా పెట్టారు. విజ‌యం సాధించిన ప్ర‌క్రియ‌లో నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమ‌, అభిమానం వ‌ల‌న‌నే నేను తొంద‌ర‌గా కోలుకున్నాను అని అన్నారు. ఇర్ఫాన్ త్వ‌ర‌లో హిందీ మీడియం సీక్వెల్‌లో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.



1840
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology