సెట్స్‌లో డైరెక్టర్‌తో కలిసి నవ్వుతూ..ఫొటో వైరల్

Thu,April 18, 2019 04:44 PM
Irrfan Khan shares a light moment with director Homi Adajania


ఇండియా లో అద్బుతమైన టాలెంట్ ఉన్న నటుల్లో బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఇర్ఫాన్‌ఖాన్. న్యూరోఎండ్రోక్రైన్ ట్యూమర్ (అరుదైన క్యాన్సర్)తో బాధపడుతున్న ఇర్ఫాన్‌ఖాన్..ఇటీవలే లండన్‌లో చికిత్స అనంతరం తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. చికిత్స తర్వాత ఇర్ఫాన్ గతంలో కనిపించిన ఛరిష్మా ఏ మాత్రం తగ్గకుండా తాజా చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు.

2017లో వచ్చిన 'హిందీ మీడియం' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ప్రాజెక్టు 'అంగ్రేజి మీడియం'. ఇర్ఫాన్ డైరెక్టర్ హోమి అడ్ జానియాతో కలిసి సినిమా సెట్స్‌లో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన నటుడి ముఖంలో చిరునవ్వు కనిపించడంతో ఇర్ఫాన్‌ఖాన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles