పెళ్లి వార్త కోసమేనా..? అనుష్క ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఫొటో వైరల్

Mon,October 29, 2018 07:22 PM
Is Anushka shetty plans for wedding instragram pic gone viral

భాగమతి తర్వాత సినిమాకు కొంత విరామం తీసుకుంది టాలీవుడ్ హీరోయిన్ అనుష్క. కొన్ని రోజులుగా అభిమానులకు కనిపించని ఈ బెంగళూరు బ్యూటీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఫొటోను పెట్టి అభిమానులని సర్‌ఫ్రైజ్ చేసింది. అనుష్క కాలిమెట్టెల లాగా కాలివేళ్లపై ఆకులను పెట్టుకున్న ఫొటో ఒకటి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు క్యాప్షన్ అవసరం లేదని కామెంట్ పెట్టింది స్వీటీ. క్యాప్షన్ అవసరం లేదంటూనే అనుష్క పెళ్లి వార్త చెప్పబోతుందా ..? అని అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అనుష్క ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టిన ఈ ఫొటోకు లక్షకుపైగా లైక్‌లు వచ్చాయి. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టిన ఫొటో వెనుక ఉన్న అసలు విషయమేంటో..అనుష్క చెబుతుందో చూడాలి మరి.

6252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles