విరాట ప‌ర్వం క‌థ ఇదేనా ?

Wed,June 19, 2019 12:16 PM

రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘విరాటపర్వం 1992’ చిత్రం రీసెంట్‌గా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే . నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక ప‌రిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెర‌కెక్కించ‌నున్నాడు . పీరియాడిక్ సోష‌ల్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ చిత్రంకి సంబంధించిన క‌థ ఇదే అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. చిత్రంలో సాయి ప‌ల్ల‌వి రిపోర్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రానా న‌క్స‌లైట్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఓ సంద‌ర్భంలో రానాని ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వెళ్ళి సాయిప‌ల్ల‌వి అత‌ని ప్రేమ‌లో ప‌డుతుంద‌ని, ఆమె వ‌ల‌న రానా న‌క్స‌లిజాన్ని వ‌దిలేసి ఎల‌క్ష‌న్‌లో పోటీ చేసి వార్డ్ మెంబ‌ర్‌గా గెలుస్తార‌ట‌. వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ని ద‌ర్శ‌కుడు స‌హ‌జ సిద్ధంగా చూపించ‌బోతున్నాడ‌ట‌. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ చిత్రంలో వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌. ఇంత‌వ‌ర‌కు త‌ను ఆ పాత్ర‌లో క‌నిపించ‌లేద‌ని చెబుతున్నారు.

2263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles