అశోక్ గ‌ల్లా స‌ర‌స‌న ఇస్మార్ట్ హీరోయిన్

Fri,November 8, 2019 12:17 PM

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అశోక్ డెబ్యూ చిత్రం న‌వంబ‌ర్ 10న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకి గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం అఫీషియ‌ల్ ప్ర‌క‌టన చేశారు. ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం భూమి అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తుంది.

1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles