మూడు రోజుల్లో 36 కోట్లు కొల్ల‌గొట్టిన ఇస్మార్ట్ శంక‌ర్

Sun,July 21, 2019 09:57 AM
Ismart Shankar enter into 36 crore mark

ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్‌ని చాలా స్మార్ట్‌గా కొల్ల‌గొడుతున్నాడు. ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం అభిమానుల అంచ‌నాల‌ని అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపిస్తుంది. తొలి రోజే ఊహించ‌ని క‌లెక్ష‌న్స్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు 25 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు చేసింది. మూడో రోజుకి 36 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన‌ట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి పోటీగా మ‌రో చిత్రం లేక‌పోవ‌డం, వీకెండ్ కూడా క‌లిసి రావ‌డంతో చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై 18న గ్రాండ్‌గా విడుద‌లైంది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. క్లాస్, మాస్ మేళవింపుతో అంతర్లీనంగా రెండు ప్రేమకథలను నడిపిస్తూనే సమాంతరంగా హత్యానేరం దాని తాలూకూ చిక్కుముడులతో కథనాన్ని అల్లుకున్నారు. చాలా రోజుల త‌ర్వాత ఇటు పూరీకి ఇటు రామ్‌కి ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలో మంచి హిట్ దొరికింద‌నే చెప్పాలి

1987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles