ఇస్మార్ట్ శంక‌ర్ కిక్ మాములుగా ఉండ‌ద‌ట‌

Fri,July 12, 2019 08:35 AM

మంచి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేని, పూరీ జ‌గ‌న్నాథ్‌లు తొలిసారి క‌లిసి చేసిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనక్ట్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు. జూలై 18న విడుద‌ల కానున్న ఈ చిత్రం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రం ఫ‌స్ట్ షో చూసిన రామ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడే చూశాను. దీన‌మ్మా కిక్కూ..!! ఈ పాత్ర పోషిస్తున్న‌ప్పుడు, స్క్రీన్‌పై చూసుకున్న‌ప్పుడు వ‌చ్చిన కిక్కే వేర‌ప్ప.. ఇలాంటి కిక్ ఇచ్చిన సినిమా చేసి చాలా రోజులు అయింది. థ్యాంక్స్ పూరీ జగన్నాథ్ గారూ.. మీరు డ్రగ్ అని చాలా మంది గ్రహించరు’.. అంటూ తన సినిమాకి హైవోల్టేజ్ రివ్యూ ఇచ్చారు రామ్. దీనికి స్పందించిన పూరీ.. డ్ర‌గ్ అనేది నాకు అతి పెద్ద కాంప్లిమెంట్‌. నీ వ‌ల్లే నాకు ఆ కిక్కు సాధ్య‌మైంది. నీ ఎన‌ర్జీ వ‌ల్లే ఇస్మార్ట్ శంక‌ర్‌కి ఇంత కిక్ వ‌చ్చింది. మూవీ అయిపోయిన త‌ర్వాత నువ్వు ఇచ్చిన కౌగిలి ఎప్ప‌టికి మ‌ర‌చిపోను. మ‌నం రాక్ చేద్దాం అంటూ పూరీ త‌న ట్వీట్‌లో తెలిపారు. మ‌రి సినిమా అస‌లు రిజ‌ల్ట్ ఏంట‌నేది తెలియాలంటే జూలై 18 వ‌ర‌కు ఆగాల్సిందే.
1182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles