ఆ సింగ‌ర్స్ ప్ర‌య‌త్నాన్ని అభినందించి తీరాల్సిందే!

Wed,August 14, 2019 01:06 PM

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం క్ష‌ణ క‌ణం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాల్ వర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని క‌లిగించింది. ఎంఎం కీర‌వాణి సంగీతం చిత్రానికి మ‌రో ప్ల‌స్ పాయింట్ . ఈ సినిమాలో జాము రాతిరి జాబిలమ్మా.. అనే పాట ఎప్ప‌టికి ఎవ‌ర్ గ్రీన్‌. వెంక‌టేష్‌, శ్రీదేవిల‌పై వ‌ర్మ చిత్రీక‌రించిన ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే సిరివెన్నెల సీతారామ‌శ్రాస్త్రి రాసిన ఈ పాట‌ని నేటి యువ సింగ‌ర్స్ త‌మ‌దైన స్టైల్‌లో షూట్ చేసి వీడియోగా రూపొందించారు. పృద్వీ చంద్ర ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ పాట‌ని హేమ‌చంద్ర‌, కాళ భైర‌వ‌, మ‌నీషా, దీపు, దామిని, మౌనిమ‌, శృతి, నోయ‌ల్‌, పృధ్వీ చంద్ర క‌లసి ఆల‌పించారు. ఈ వీడియోని కీర‌వాణి త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ.. సాన్ జోస్‌లో నా టీం చేసిన వ‌ర్క్ మీకు ఎంత‌గానో న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. ఆ సాంగ్ రికార్డ్ అయిన‌ప్పుడు ఈ యువ సింగ‌ర్స్‌లో కొందరు ఇంకా పుట్టి ఉండ‌రు అనుకుంటా అని కీర‌వాణి త‌న ట్వీట్‌లో తెలిపారు.
1359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles