విజ‌య్ సినిమాలో బాలీవుడ్ న‌టుడు

Fri,March 22, 2019 12:09 PM
Jackie Shroff plays crucial role in vijay movie

ఇల‌య‌త‌ల‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో తాజా చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు జాకీష్రాఫ్‌ని ఎంపిక చేసిన‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. 'మాయావనం' తరువాత జాకీ ష్రాఫ్ తమిళంలో చేస్తోన్న సినిమా ఇది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చిత్రంలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది. క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీస్ ల‌ఘాన్, పీలే చిత్ర త‌ర‌హాలో ఉంటాయ‌ని అంటున్నారు. ఇందులో విజ‌య్ పాత్ర పేరు మైఖేల్ అని తెలుస్తుంది.ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో కథిర్, యోగిబాబు, వివేక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles