ఎన్టీఆర్‌కి జోడీగా శ్రీలంక బ్యూటీ.. జ‌క్క‌న్న‌కి స‌ల‌హా ఇచ్చిన స‌ల్మాన్

Thu,April 25, 2019 10:15 AM

ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా అలియా భ‌ట్, డైసీ ఎడ్గార్‌ జోన్స్ న‌టిస్తున్న‌ట్టు రాజ‌మౌళి ఆ మ‌ధ్య జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ప్ర‌క‌టించాడు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో న‌టించ‌డం లేదని టీం తెలిపింది. దీంతో కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై హాట్ హాట్ చర్చ‌లు జ‌రుగుతున్నాయి. శ్రద్ధా కపూర్‌, పరిణీతి చోప్రా, నిత్యా మీన‌న్‌లో ఒక‌రు ఎన్టీఆర్‌తో జోడి క‌డ‌తార‌ని మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌ర‌గ‌గా,తాజాగా శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫ్రేములోకి వ‌చ్చింది.


కిక్ చిత్రంతో జాక్వెలిన్‌కి మంచి బ్రేక్ ఇచ్చిన స‌ల్మాన్ ఖాన్ ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కి జోడీగా శ్రీలంక భామ‌ని ఎంపిక చేయ‌మ‌ని సూచించాడ‌ట‌. జాక్వెలిన్ కూడా కాస్త బ్రిటీష్ అమ్మాయిలా ఉంటుంది కాబ‌ట్టి మీరు అనుకున్న పాత్ర‌కి ఆమె స‌రిగ్గా యాప్ట్ అవుతుంద‌ని స‌ల్మాన్‌..జ‌క్క‌న్న‌తో అన్నాడ‌ట‌. మ‌రి ఇందులో ఎంత నిజ‌ముంద‌నేది రానున్న రోజుల‌లో తెలుస్తుంది. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 2020 జులై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న స‌మ‌యంలో రామ్ చరణ్‌కు గాయం కావడంతో చిత్ర షూటింగ్‌ 3 వారాల పాటు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

2253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles