అల్లుడికి స్వాగ‌తం ప‌లికిన జ‌గ‌ప‌తి బాబు

Sat,January 12, 2019 07:41 AM
jagapathi babu welcomes to karthikeya into his family

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం జగపతిబాబు సోదరుడు రాం ప్రసాద్ కుమార్ కుమార్తె, గాయని పూజా ప్రసాద్‌తో ఆదివారం( డిసెంబ‌ర్ 30) సాయంత్రం రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల హోటల్ ఫెయిర్‌మౌంట్‌లో ఘ‌నంగా జ‌ర‌గిన సంగ‌తి తెలిసిందే. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వీరి వివాహానికి ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, రానా, నాని , నాగార్జున, రాఘ‌వేంద్ర‌రావు, అఖిల్, సుస్మితా సేన్‌ తో పాటు త‌దిత‌ర ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. జైపూర్‌లో వివాహ వేడుక‌లు పూర్తి కావ‌డంతో అంద‌రు హైదరాబాద్ వ‌చ్చేశారు. అయితే జ‌గ‌ప‌తి బాబు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. కార్తికేయ‌, పూజాల పెళ్ళి కార‌ణంగా హైద‌రాబాద్ కొన్ని అద్భుత‌మైన ఫోటోల‌ని సంపాదించింది. అల్లుడు (కార్తికేయ‌)గారు మా ఫ్యామిలీలోకి రావ‌డంతో మా కుటుంబం ప‌రిపూర్ణ‌మైంది. వెల్‌క‌మ్ అల్లుడు గారు అంటూ కామెంట్ పెట్టారు జ‌గ‌ప‌తి బాబు. ఈ ట్వీట్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రాజ‌మౌళి త్వ‌ర‌లోనే త‌న కుమారుడి రిసెప్ష‌న్‌ని హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ వేడుక‌కి టాలీవుడ్ తారాగ‌ణం మొత్తం త‌ర‌లి రానుంది.26366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles