మరోసారి మహేశ్, జగ్గూభాయ్ కాంబినేషన్..?

Tue,April 23, 2019 06:24 PM
jagapatibabu once again act in Mahesh Babu next?


మహేశ్‌బాబు, జగపతిబాబు కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మరోసారి మహేశ్, జగ్గూభాయ్ కలిసి తెరపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించనున్నారట. అనిల్-మహేశ్ ప్రాజెక్టులో జగ్గూభాయ్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. శ్రీమంతుడు చిత్రంలో మహేశ్‌కు తండ్రిగా నటించాడు జగపతిబాబు. దిల్‌రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మహర్షి సినిమా విడుదల తర్వాత ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

2532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles