జై సింహా కాంబినేష‌న్ రిపీట్

Fri,April 26, 2019 08:41 AM
jai simha combination repeats

గ‌త ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన చిత్రం జై సింహా. నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని కేఎస్ ర‌వికుమార్ డైరెక్ట్ చేశారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో న‌యనతార, నటాషా దోషి, హరిప్రియలు క‌థానాయిక‌లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌ళ్ళీ ఏడాది త‌ర్వాత ఈ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో.. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సి. కళ్యాణ్ కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నారు. మే నెలలో ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకుని.. జూన్ నెల నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. ఈ చిత్రంకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఇక ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన బోయపాటి ముచ్చ‌ట‌గా మూడో సారి బాల‌య్య‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్‌ రెండో వారం నుండి షూటింగ్ జ‌రుపుకోనుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

1237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles