సైరా సెట్‌లో అమితాబ్‌తో దిగిన ఫోటోలు షేర్ చేసిన ప‌వ‌న్

Thu,August 22, 2019 09:56 AM

టాలీవుడ్‌లో తెర‌కెక్కిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ రాజ‌గురువు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై మూవీ నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అమితాబ్ టీంతో క‌లిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. అదే స‌మయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరా సెట్‌కి వెళ్ళారు. త‌న అభిమాన న‌టుడు.. అన్న‌య్య సినిమాలో న‌టిస్తున్నార‌ని తెలిసి, బిగ్ బీని క‌లిసేందుకు అక్క‌డికి వెళ్లారు ప‌వ‌న్‌. కొద్ది సేపు అమితాబ్ తో ముచ్చ‌టించిన త‌ర్వాత చిరు, అమితాబ్, చెర్రీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి ఫోటో దిగారు.ఆ ఫోటో అప్ప‌ట్లో వైర‌ల్ కాగా, ప‌వ‌న్ తాజాగా మ‌రోసారి ఆ ఫోటోల‌ని త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా షేర్ చేశాడు. నా జీవితంలో ఆ క్ష‌ణం ఎంతో అపురూపం. నా గురువు, గౌరవప్రదమైన ‘శ్రీ అమితాబ్ బచ్చన్ జీ’ ను ‘సైరా’ సెట్స్‌లో కలిసాను. అతని జీవితం మనకు ఎన్నో బోధిస్తుంది. జీవితంలో ఎదుగుతున్న క్ర‌మంలో ఎదుర‌య్యే అస‌మాన‌త‌ల‌ని ఎలా పోరాడాలి అనేది ఆయ‌న జీవితం నేర్పిస్తుంది అని ప‌వ‌న్ పేర్కొన్నారు.


1736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles