జ‌పాన్‌లో భ‌ళ్ళాలదేవుడ‌కి ఘ‌న స్వాగతం

Wed,December 5, 2018 08:21 AM
japaneese grand welcome to rana

బాహుబ‌లి సినిమా సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి సంబంధించిన రికార్డులు అన్ని ఇండ‌స్ట్రీల‌ని ఎంత‌గా షాక్‌కి గురి చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సినిమాలో న‌టించిన న‌టీన‌టులపై కూడా ప్రేమ‌ని పెంచుకున్నారు. ఆ మ‌ధ్య రాజ‌మౌళి, సుబ్బ‌రాజ్‌లు జ‌పాన్‌కి వెళ్ళ‌గా అక్క‌డ వీరికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. తాజాగా ‘టోక్యో కామిక్‌ కాన్‌’ వేడుకలో పాల్గొనేందుకు గతవారం రానా జపాన్‌ వెళ్లగా, అక్కడి అభిమానులు భళ్లాలదేవుడికి ఘన స్వాగతం పలికారు.

జ‌పాన్ అభిమానుల ఆద‌ర‌ణ‌కి మురిసిపోయిన రానా వారితో ఫోటోలు దిగాడు. వీడియోలు తీసుకున్నాడు. వాటిని తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ బాహుబలి’ కుటుంబంపై మీరు చూసిన ప్రేమకు ధన్యవాదాలు’ అని అన్నారు. డిసెంబ‌ర్ 14న రానా 34వ పుట్టిన రోజు కావ‌డంతో ముందుగానే ఆయన పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేశారు. జపాన్‌ అభిమానుల ముందు రానా కేక్‌ కట్‌ చేశారు. మంగళవారంతో అద్భుతమైన జపాన్‌ ట్రిప్‌ పూర్తయిందని రానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘మీకు మరిన్ని కథలు చెప్పడానికి త్వరలో మళ్లీ వస్తాను జపాన్‌’ అని పేర్కొన్నారు. ‘టోక్యో కామిక్‌ కాన్‌’ వేడుకలో ‘హ్యారీ పోటర్‌’ ఫ్రాంచైజ్‌ క్రియేటర్స్‌, హాలీవుడ్‌ నటుడు (‘అవెంజర్స్‌’ ఫేం) టామ్‌ హిడిల్‌టన్ తదితరులు రానాతో వేదిక పంచుకున్నారు. రానా ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు.

View this post on Instagram

The birthday came in early this year. ComicCon

A post shared by Rana Daggubati (@ranadaggubati) on2022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles