సత్ప్రవర్తన వల్ల త్వరగా బ‌య‌టికొచ్చిన‌ 'జాతిర‌త్నాలు'

Thu,October 24, 2019 01:10 PM

న‌వీన్ పాలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌న్‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న చిత్రం జాతి రత్నాలు. స్వ‌ప్న సినిమాస్ బేన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కేవీ అనుదీప్ డైరెక్ట్ చేస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా చిత్ర పోస్ట‌ర్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో ముగ్గురు ఖైదీ డ్రెస్‌ల‌లో క‌నిపిస్తున్నారు. సత్ప్రవర్తన వల్ల త్వరగా బయటికొస్తున్న మా వాళ్ళు. ఈ దీపావళికి మీ జాతిరత్నాలు అనే కామెంట్‌తో పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ర‌ధ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అతి త్వ‌ర‌లో చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

1458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles