83 చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జీవా

Thu,April 4, 2019 01:14 PM

కొద్ది రోజులుగా స‌రైన స‌క్సెస్‌లు లేక ఇబ్బందిప‌డుతున్న జీవా స‌మ్మ‌ర్‌కి ముందు కీ, గొరిల్లా అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించ‌నున్నాడు. అయితే తాజాగా ఆయ‌న 83 చిత్ర టీంతో క‌లిసాడు. ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ తో క‌లిసి దిగిన ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న 83 చిత్రంలో క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో జీవా క‌నిపించ‌నున్నాడు. ముందుగా ఈ పాత్ర‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని తీసుకోవాల‌నుకున్న‌ప్ప‌టికి, ఆయ‌న డేట్స్ కేటాయించ‌క‌పోవ‌డం వ‌ల‌న జీవాని ఎంపిక చేశార‌ని అప్ప‌ట్లో ప్రచారం జరిగింది. 83 చిత్రం జీవాకి డెబ్యూ కానుంది.


క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ర‌ణ‌వీర్ సింగ్ .. క‌పిల్ దేవ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్క‌నుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. 2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌నున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించ‌నుంది.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles