మైసూర్ పాక్ కోసం మైసూర్ వెళుతున్న కుర్ర హీరో.. టీజ‌ర్

Wed,July 24, 2019 12:27 PM
Jodi Teaser released

సాయి‌కు‌మార్‌ తన‌యుడు ఆది కథా‌నా‌య‌కు‌డిగా విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జోడి అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కథానాయిక‌గా శ్ర‌ద్ధ శ్రీనాథ్ న‌టిస్తుంది. ఉగాది పండుగ సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. రొమాంటిక్ మూవీగా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో ఆదిని కొత్త కోణంలో చూపించ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఫ‌ణి క‌ళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేష్ గుర్రం మ‌రియు ప‌ద్మ‌జ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, సీనియ‌ర్ న‌రేష్‌, మిర్చి మాధ‌వి, గొల్ల‌పూడి కీల‌క పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో హీరోయిన్ .. మీరెంటి ఇక్క‌డ అన‌గానే.. మా నాన్న‌కి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం.ఐదు కేజీలు కొందామ‌ని మైసూర్ వెళుతున్నా అని ఆది చెబుతాడు. ఈ డైలాగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. కామెడీతో పాటు రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉండ‌నున్న ఈ చిత్రం ఆదికి మంచి హిట్ అందిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

1052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles