బ్రిటీష్ సైనికుల‌తో ఎన్టీఆర్ పోరాటం..!

Tue,June 4, 2019 01:06 PM

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ గాయ‌ప‌డ్డ కార‌ణంగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కి కొన్ని వారాల పాటు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన భారీ సెట్‌లో ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తుంది. కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్ బ్రిటీష్ సైనికుల‌తో త‌ల‌ప‌డే స‌న్నివేశాల‌ని రాజ‌మౌళి చిత్రీక‌రించాడ‌ట‌. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా రూపొంద‌నున్న ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ విహారయాత్ర‌లో ఉండ‌గా, ఆయ‌న హైద‌రాబాద్‌కి రాగానే షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో చెర్రీ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఎన్టీఆర్‌తో న‌టించే భామ ఎవ‌రో తెలియాల్సి ఉంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు. జూలై 30 .. 2020వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

2513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles