ట్విట్ట‌ర్‌లో అరుదైన మైలురాయి చేరుకున్న ఎన్టీఆర్

Thu,April 25, 2019 08:28 AM
jr ntr followers reached 3 million mark

టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రైన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌కి కాస్త బ్రేక్ ప‌డ‌గా త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌పనున్నారు. అయితే సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ఎక్కువ‌గా ట‌చ్‌లో ఉండే ఎన్టీఆర్ తాజాగా అరుదైన మైలురాయి అందుకున్నాడు. రీసెంట్‌గా ఆయన ఫాలోవ‌ర్స్ సంఖ్య మూడు మిలియ‌న్ల‌కి చేరింది. దీంతో అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. 2009లో ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కేవ‌లం 370 ట్వీట్స్ మాత్ర‌మే చేశారు. టాలీవుడ్ హీరోస్‌లో మ‌హేష్ బాబు 7.6 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌తో తొలి స్థానంలో ఉండ‌గా, ఆయ‌న త‌ర్వాత నాగార్జున ( 5.72 మిలియ‌న్ల‌ ఫాలోవర్స్), రానా ( 5.66 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్), ప‌వ‌న్ క‌ళ్యాణ్ (3.53 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్), నాని ( 3.25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌), అల్లు అర్జున్ (3.09 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌) ఉన్నారు. తాజాగా మూడు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించిన తారక్ టాలీవుడ్ నుంచి ట్విట్టర్‌లో ఏడో స్థానంలో నిలిచాడు.

2114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles