చేతికి క‌ట్టుతో జూనియర్ ఎన్టీఆర్

Sun,May 5, 2019 12:41 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ ఇటీవ‌ల గాయ‌ప‌డ్డాడు. హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్‌పై కొన్ని కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తుండ‌గా, ఆయ‌న‌ చేతి మ‌ణిక‌ట్టుకి గాయ‌మైంది. దీంతో ఆయ‌న వెంటనే ఆసుప‌త్రికి వెళ్లి వైద్యం తీసుకున్నారు. ఆసుప‌త్రి నుండి బ‌య‌ట‌కి వ‌స్తున్న స‌మ‌యంలో ఎన్టీఆర్ బ్యాండేజ్‌తో క‌నిపించ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందారు. ఎన్టీఆర్‌కి ఏం జ‌రిగింద‌ని ఆరాలు తీసారు. తాజాగా మ‌రోసారి ఆయ‌న క‌ట్టుతో కనిపించ‌డంతో అభిమానుల‌లో చ‌ర్చ మొద‌లైంది.


ఎన్టీఆర్ 2011 మే 2న ప్ర‌ణ‌తిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నేటితో వారి వివాహం జ‌రిగి 8 సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌డంతో ఎన్టీఆర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌ణ‌తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ‘ఎనిమిదేళ్లు.. మున్ముందు మరెన్నో సంవత్సరాల కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నాడు. అయితే ఫోటోలో ఎన్టీఆర్ చేతికి క‌ట్టు ఉండ‌డాన్ని చూసిన అభిమానులు ఈయ‌న చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌డానికి మ‌రింత టైం ప‌ట్టొచ్చ‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కాలికి గాయం కార‌ణంగా చిత్ర షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది. మ‌రి చిత్రంలో ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్న ఇద్దరు హీరోలు గాయం కార‌ణంగా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటున్న నేప‌థ్యంలో మూవీ రిలీజ్ అనుకున్న టైంకి విడుద‌ల అవుతుందా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.కాగా, ఎన్టీఆర్ పెళ్ళి రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ఆయ‌న ఆరోగ్యంకి సంబంధించి జాగ్ర‌త్త‌లు తీసుకోమ‌ని సూచ‌న‌లిస్తున్నారు.

View this post on Instagram

8 Years!! Looking forward to many more...

A post shared by Jr NTR (@jrntr) on

4129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles