జావా ఐలాండ్‌లో సూర్య మూవీ సాంగ్ షూటింగ్

Thu,April 25, 2019 10:55 AM
Kaappaan while shooting for a song at Jawa island

త‌మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'కప్పాన్‌' మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య‌, ఆర్య‌, మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న 'కప్పాన్‌' చిత్రాన్ని కేవీ ఆనంద్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడిగా ఉంటాడ‌ట‌. స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగ‌ల్.. సూర్య స‌ర‌స‌న న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. తాజాగా జావా ఐలాండ్‌లో సాంగ్ షూటింగ్ జ‌రిపేందుకు చిత్ర యూనిట్ అక్క‌డికి చేరుకుంది. సూర్య‌, సాయేషాపై రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. చిత్రం దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతుందని అంటున్నారు.

1002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles