200 కోట్ల మార్క్ క్రాస్ చేసిన క‌బీర్ సింగ్

Thu,July 4, 2019 11:13 AM

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌గా బాలీవుడ్‌లో క‌బీర్ సింగ్ అనే చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. జూన్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చూపిస్తుంది. కేవ‌లం ఇండియాలోనే ఈ చిత్రం 200 కోట్ల మార్క్ రాబ‌ట్టింది. ఇప్ప‌టికీ ఈ చిత్రం థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ క్ర‌మంలో క‌బీర్ సింగ్ ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే. షాహిద్ క‌పూర్ కెరియర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన చిత్రంగా క‌బీర్ సింగ్ నిలవడం విశేషం.

2416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles