హెచ్చరిక‌లు వ‌స్తున్నా ప‌ట్టించుకోని వ‌ర్మ‌.. టైటిల్ సాంగ్ విడుద‌ల‌

Tue,December 19, 2017 11:25 AM

వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే వ‌ర్మ తాజాగా క‌డప పేరుతో రాయలసీమ ఫ్యాక్షనిజంపై వెబ్ సీరిస్‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే.. త‌ను అనుకున్న‌ది తెర‌పైన చూపించ‌డానికి సెన్సార్ బోర్డు అడ్డు వ‌స్తుంద‌ని భావించిన వ‌ర్మ ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియాని ఎంచుకున్నాడు. ఇటీవ‌ల‌ క‌డ‌ప రెడ్ల నిజాలు అంటూ వెబ్ సిరీస్‌కి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌ల చేశాడు. ఇందులో బోల్డ్ కంటెంట్‌తో పాటు ఫ్యాక్ష‌నిజం, బూతు ప‌దాలు కూడా ఉన్నాయి. ప్రశాంతగా ఉన్న రాయలసీమను ఫ్యాక్షన్ అడ్డాగా చూపిస్తూ.. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని .. ఈ కారణంగా వ‌ర్మ‌ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్ చేసారు. అంతేకాదు వెంట‌నే అరెస్ట్ చేయకపోతే కోర్టులో పిల్ దాఖలు చేయడానికైనా సిద్ధమే అంటున్నారు రాయలసీమ విమోచన సమితి నాయకులు. మ‌రి ఒక‌వైపు హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న అవేమి లెక్క‌చేయ‌కుండా ఈ రోజు ఉద‌యం క‌డ‌ప టైటిల్ సాంగ్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా విడుదల చేశాడు వ‌ర్మ‌. సిరాశ్రీ రాసిన పాట‌లోని లిరిక్స్ ఇప్పుడు క‌ల‌కలం రేపుతున్నాయి .


"కడప కడప కడప కడప కడప కడప కడప
అది యమద్వారపు గడప
కడప కడప కడప కడప కడప కడప కడప
అది బలిపీటపు గడప
కడపంటే ఫ్యాక్షన్, కడపంటే యాక్షన్

కడపంటే ఓ టెన్షన్, కడపే అటెన్షన్
కడపంటే ఊరు కాదు... బాంబురా కొడకా
కడపంటే పేరు కాదు... మృత్యువురా కొడకా
కడపకెదిరి తొడగొడితే గోతిలోనే పడక
కడపను తిరగేస్తే పడక కానీ అది చావు కొడకా...!"

అంటూ సాగే ఈ పాటపై రాయ‌ల‌సీమ నేత‌లు మండిప‌డుతున్నారు. అంద‌రు మ‌ర‌చిపోయిన ఫ్యాక్ష‌నిజాన్ని మ‌ళ్లీ చూపించి వ‌ర్మ ఏం చెప్పాల‌నుకుంటున్నాడు అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. క‌డ‌ప హింస‌కే కాదు మంచి సంస్కృతికి కూడా ఇది నిద‌ర్శ‌నం . ఇది వ‌ర్మ తెలుసుకోవాల‌ని వారు హిత‌వు ప‌లుకుతున్నారు. కేవ‌లం సాంగ్స్, ట్రైల‌ర్‌తో ఇంత క‌ల‌క‌లం రేపుతున్న వ‌ర్మ వెబ్ సిరీస్‌తో ఇంకెంత వివాదం సృష్టిస్తాడో మ‌రి..!

2507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles