బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కాజ‌ల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Wed,June 19, 2019 01:19 PM

క‌లువ క‌ళ్ళ సుంద‌రి కాజ‌ల్ 33 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని నేడు 34వ ప‌డిలోకి అడుగు పెట్టింది. ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం త‌మిళం, హిందీ భాష‌ల‌లోను రాణిస్తుంది. రీసెంట్‌గా సీత అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం కాజ‌ల్ కిట్టీలో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉండ‌గా, శ‌ర్వానంద్‌తో క‌లిసి ర‌ణ‌రంగం అనే సినిమా చేస్తుంది. ఇందులో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ కూడా న‌టిస్తుంది. సుధీర్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.


కాజ‌ల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ర‌ణరంగం చిత్రంలోని ఆమె లుక్‌ని విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో కాజ‌ల్ ఫుల్ జోష్‌తో క‌నిపిస్తుంది. ఆమె బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని టీం అంతా కాజ‌ల్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంది. ర‌ణ‌రంగం చిత్రానికి ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. శ‌ర్వా చేయ‌బోవు రెండు పాత్ర‌ల‌లో ఒక‌టి యంగ్ ఏజ్ వ్య‌క్తి కాగా, మ‌రొక‌టి ముస‌లి వ్య‌క్తి అని అంటున్నారు. ఆగ‌స్ట్ 2న విడుద‌ల కావ‌ల‌సిన‌ ఈ చిత్రం శ‌ర్వానంద్‌కి జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డేలా క‌నిపిస్తుంది. కాగా, కాజ‌ల్ క్వీన్ రీమేక్ తో పాటు, జయం రవి హీరోగా వస్తున్న తమిళ చిత్రం “కోమలి” మూవీలో నటిస్తున్నారు. మ‌ను చరిత్ర అనే చిత్రాన్ని కాజ‌ల్ స‌మ‌ర్పిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తున్నారు.

2356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles