భారతీయుడు2 నుండి కాజ‌ల్ ఔట్‌.. వ‌చ్చిన క్లారిటీ

Wed,August 14, 2019 11:33 AM

క‌మ‌ల్ హాస‌న్- శంక‌ర్ కాంబినేష‌న్‌లో భార‌తీయుడు 2 చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే వారం లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారం నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా ప్రియా భావ‌న శంక‌ర్, ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన‌ పాత్ర‌లో ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న కాజ‌ల్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని ఆమె స్థానంలో ర‌కుల్‌ని క‌థానాయిక‌గా తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా స్పందించింది కాజ‌ల్‌. కమల్‌ సినిమా నుంచి వైదొలిగాన‌ని వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వం. ఆ సినిమా నుండి అస్స‌లు త‌ప్పుకోను అని కాజ‌ల్ పేర్కొన్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ ఇండియ‌న్ 2 చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో సిద్ధార్ద్‌, విద్యుత్ జ‌మాల్‌, ఢిల్లీ గ‌ణేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

1754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles