ఆక‌ట్టుకునే సన్నివేశాల‌తో 'క‌ళంక్' టీజ‌ర్

Tue,March 12, 2019 01:45 PM
Kalank  Official Teaser released

ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ క‌ల‌ల ప్రాజెక్ట్ క‌ళంక్ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరందుకుంటున్నాయి. ఈ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ హీరో, హీరోయిన్‌ల‌ పాత్ర‌ల‌ని ఒకొక్క‌టిగా ప‌రిచ‌యం చేస్తూ మూవీపై అంచ‌నాలు పెంచిన‌ క‌ర‌ణ్ తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేశాడు. ఇందులోని స‌న్నివేశాలు బాహుబ‌లి చిత్రాన్ని గుర్తుకు తెస్తున్నాయి. అంద‌మైన క‌ళాకృతితో పాటు క‌ట్ట‌డాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటున్నాయి. భారీ పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ వ‌ర్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కరణ్ జోహర్‌, సాజిద్ నదియావాలా, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కరణ్‌ జోహార్‌ తండ్రి యశ్‌ జోహార్‌ కలల ప్రాజెక్టు కావ‌డంతో ప్రత్యేక శ్రద్ధ తీసు‌కుం‌టు‌న్నాడు.‌ తను ఇంత‌వ‌రకు నిర్మిం‌చిన చిత్రా‌ల‌లో‌కెల్లా అత్యంత ప్రతి‌ష్టా‌త్మ‌క చిత్రంగా ‌‘కళంక్‌’ ని తీర్చి‌ది‌ద్దా‌లని కృత‌ని‌శ్చ‌యంతో ఉన్నాడు. ఈ సినిమా కోసం ఓల్డ్‌ ఢిల్లీ సిటీ సెట్టింగ్‌ నిర్మా‌ణా‌నికి ఏకంగా పది‌హేను కోట్లు ఖర్చు చేసాడ‌ట‌. 1940 కాలానికి చెందిన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రం రూపొందుతుంది. స్వాతంత్య్రం రాక‌ముందు ఓ యువ‌రాణికి, సామాన్య వ్య‌క్తికి మ‌ధ్య పుట్టిన ప్రేమ క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సిని‌మాలో సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్‌ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషి‌స్తు‌న్నారు.

2114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles