బాల‌నటుడు నుండి హీరోగా..60 ఏళ్ళ సినీ ప్ర‌యాణం

Tue,August 13, 2019 08:46 AM
kamal haasan complets 60 years in the industry

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాసన్ 59 ఏళ్ళ సినీ ప్ర‌యాణం పూర్తి చేసుకొని 60లోకి అడుగుపెట్టాడు. 1960లో వ‌చ్చిన క‌ల‌తుర్ క‌న్న‌మ్మ చిత్రంతో బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్ ఆ త‌ర్వాత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. ద‌శావ‌తారం చిత్రంలో ఏకంగా ప‌ది అవ‌తారాల‌లో క‌నిపించి అభిమానులు మైమ‌ర‌చేలా చేశారు క‌మ‌ల్‌. క‌ల‌తుర్ క‌న్న‌మ్మ చిత్రంలో బాల‌న‌టుడిగా న‌టించిన క‌మ‌ల్‌కి గోల్డ్ మెడ‌ల్ కూడా ద‌క్కింది, 1975లో వచ్చిన అపూర్వ రాగంగ‌ల్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు క‌మ‌ల్‌. బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో భార‌తీయుడు 2 చిత్రం చేస్తున్నాడు క‌మ‌ల్‌. వ‌చ్చే నెల‌లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్‌-శంకర్ కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి . భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌తో పాటు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. 60 ఏళ్ళ సినీ జ‌ర్నీ పూర్తి చేసుకున్న క‌మ‌ల్‌కి తోటి న‌టీన‌టుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

2691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles