బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న కాంచ‌న 3.. వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన హార‌ర్ చిత్రం

Fri,April 26, 2019 12:05 PM
Kanchana 3 enter into 100 crore club

దాదాపు పన్నెండేళ్ల క్రితం ముని చిత్రంతో తొలిసారి హారర్ చిత్రాలకు శ్రీకారం చుట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించడంతో దానికి సీక్వెల్స్‌ని తెరపైకి తీసుకొస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ సినిమా నుంచి కాంచన, కాంచన-2 సిరీస్‌లు వచ్చాయి. ఇవి కూడా తెలుగు, తమిళ భాషల్లో విజయాల్ని సాధించి భారీ వసూళ్లని రాబట్టాయి. ముని ఫ్రాంచైజీలో భాగంగా దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత రాఘవ లారెన్స్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ముని-4 (కాంచన-3). తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ నెల 19న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ప్ర‌పంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా తొలి వారం రోజుల‌లో వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్ళని రాబ‌ట్టి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. ఇంత‌క ముందు సినిమాల క‌న్నా ఈ సినిమాలో లారెన్స్ మ‌రింత భ‌య‌పెట్టాడు. రానున్న రోజుల‌లో ఈ చిత్రానికి మ‌రిన్ని వ‌సూళ్ళు రావ‌డం ఖాయమంటున్నారు. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు.

3134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles