మణికర్ణిక విమర్శలపై కంగనా ఫైర్

Fri,February 9, 2018 05:33 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. ఈ చిత్రం కోసం కంగనా కత్తి యుద్ధాలలో శిక్షణ పొందింది. నటిగా ఇదే తన చివరి సినిమా కావడంతో ఈ మూవీపై చాలా కాన్సన్ ట్రేషన్ చేయడంతో పాటు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తుంది. అయితే రీసెంట్ గా మణికర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ చరిత్రను వక్రీకరించారంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సర్వ బ్రాహ్మణ మహా సభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. జై మిశ్రా రాసిన వివాదాస్పద పుస్తకం రాణీ ఆధారంగా మణికర్ణిక తెరకెక్కిస్తున్నారనే అనుమానం కలుగుతుంది . ఝాన్సీ లక్ష్మీ బాయ్కి, బ్రిటీష్ వ్యక్తికి మధ్య ప్రేమ సన్నివేశాలు తీసి చరిత్రని వక్రీకరిస్తే అస్సలు ఊరుకునేదే లేదంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు బెదిరింపులకి దిగారు. వీరికి కర్ణిసేన సపోర్ట్ ఇస్తామంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది


మణికర్ణిక చిత్రంపై వస్తున్న విమర్శలపై కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడింది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ కి, బ్రిటీష్ వ్యక్తికి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడానికి మేం తీసేది ప్రేమ కథకాదు చరిత్ర. భారతీయ మహిళలందరు గర్వించేలా తీస్తున్న ఈ మూవీ పై కొందరు ప్రచారం కోసమే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. అసలు వీరనారిపై ఇలాంటి విమర్శలేంటి. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం గురించి సినిమాలో చూపిస్తున్నాం. బాహుబలి వంటి బిగ్ సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి గొప్ప కథ అందిస్తున్నారు. ఝాన్సీ గురించి ఎవరికి తెలియని కోణాలని ఈ చిత్రంలో చూపిస్తున్నాం అని కంగనా పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజస్థాన్ లోని జోధ్పూర్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీని ఏప్రిల్ 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

1429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles