కంగనా రనౌత్ లాయర్ బెదిరిస్తున్నారు..

Wed,May 15, 2019 05:29 PM
Kangana Ranaut Lawyer Threatened to me alleges Aditya Pancholi


ముంబై: బాలీవుడ్ నటుడు కంగనారనౌత్, ఆదిత్యపంచౌలీ మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా వెర్సోవా పోలీస్‌స్టేషన్‌లో కంగనా, ఆదిత్యాపంచోలి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆదిత్యాపంచోలి గతంలో కంగనారనౌత్‌పై వేధింపులకు పాల్పడ్డాడని కంగనా సోదరి రంగోలీ వెర్సోవా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కంగనా తరపు లాయర్ తనను అత్యాచార కేసులో ఇరికిస్తానని తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆదిత్యాపంచోలి పీఎస్‌లో కౌంటర్ అప్లికేషన్ దాఖలు చేశాడు.

కంగనాపై పరువు నష్టం దావా కేసు వేశాను. ఆ కేసును విత్ డ్రా చేసుకోకపోతే నన్ను అత్యాచారం కేసులో ఇరికిస్తానని జనవరి 6న కంగనా తరపు లాయర్ బెదించారని ఆదిత్యా పంచోలి ఆరోపించాడు. ఏప్రిల్ 25 పోలీసులు నోటీసులతో నా వద్దకు రావడం చూసి ఆశ్చర్యమేసింది. కంగనా లాయర్‌తో సమావేశమైనపుడు తీసిన 18 నిమిషాల నిడివి గల వీడియోను ఇప్పటికే కోర్టుకు సాక్షాధారంగా సమర్పించానని ఆదిత్యాపంచోలి చెప్పారు. ఇద్దరు వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత..విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామని వెర్సోవా పీఎస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

1001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles