కేన్స్‌లో మెరిసిన బాలీవుడ్ భామ‌లు

Fri,May 17, 2019 10:30 AM
Kangana Ranaut, Priyanka Chopra, Deepika Padukone take over Cannes Film Festival

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్‌గా చెప్పుకొనే కేన్స్ చ‌ల‌న‌చిత్రోత్స‌వ వేడుక మే 14 సాయంత్రం (ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం) ఘ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో జ‌రుగుతున్న ఈ వేడుక‌కి ఇండియ‌న్ సెల‌బ్రిటీలు దీపికా ప‌దుకొణే, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, సోన‌మ్ క‌పూర్, కంగ‌నా ర‌నౌత్‌, డైనా పెంటి, మ‌ల్లికా షెరావత్, హీనా ఖాన్ త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌ అగ్ర కథానాయికలు దీపిక పదుకొణె, కంగనా రనౌత్‌, ప్రియాంక చోప్రా ఈ ఈవెంట్‌కి హాజ‌ర‌య్యారు. కాజీవ‌రం చీర‌లో కంగ‌నా మెరవ‌గా, ఆఫ్‌ షోల్డర్‌ గౌనులో ప్రియాంక ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇక దీపిక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో వెరైటీ లుక్‌తో క‌నిపించింది. ముగ్గురు భామ‌లు ఒకే రోజు కేన్స్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఆ ప్రాంగ‌ణం కోలాహాలంగా మారింది. 72వ అంత‌ర్జాతీయ కేన్స్ చ‌లన చిత్రోత్స‌వ వేడుక‌కి ఫ్రెంచ్‌ నటుడు, దర్శకుడు ఎడ్వర్డ్‌ బాయర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విష‌యం విదిత‌మే. కేన్స్ వేడుక ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమా ప్రీమియర్‌ షోతో ప్రారంభం అయింది.

View this post on Instagram

Cannes 2019 @red #5BFilm

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

1091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles