మిమ్మ‌ల్ని ఒక్క‌టే అడుగుతున్నా.. న‌న్ను నిషేధించండి

Thu,July 11, 2019 11:02 AM
Kangana Ranaut refuses to say sorry after fighting with journalist

కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే కంగ‌నా ర‌నౌత్ రీసెంట్‌గా మీడియాపై ఫైర‌యింది. దీంతో వారు కంగనా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని, లేని ప‌క్షంలో మీడియాకి సంబంధించిన కార్య‌క్ర‌మాల నుండి బ‌హిష్కరిస్తామ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో కంగనా స్పందిస్తూ.. ద‌య‌చేసి న‌న్ను నిషేధించండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇటు మీడియా, అటు కంగ‌నా మధ్య జ‌ర‌గుతున్న కోల్డ్ వార్ హాట్ టాపిక్‌గా మారింది.

వివ‌రాల‌లోకి వెళితే కంగనా ర‌నౌత్ న‌టించిన తాజా చిత్రం జ‌డ్జిమెంట‌ల్ హై క్యా. ఈ చిత్రంలోని ఓ పాట‌ని ముంబైలో రిలీజ్ చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఓ జ‌ర్న‌లిస్ట్‌పై కంగ‌నా మండిప‌డింది. మ‌ణిక‌ర్ణిక సినిమాకి త‌క్కువ రేటింగ్ ఇచ్చార‌ని, సినిమాకి వ్య‌తిరేఖంగా రివ్యూ రాసాడంటూ ఫైర్ అయింది. ఈ నేప‌థ్యంలో ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్ ఆఫ్ ఇండియా’ కంగనా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. కంగ‌నా నుండి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనపై క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని , అవ‌న్నీ మ‌ర‌చిపోయి ఎప్ప‌టిలాగానే ఒక‌రికొక‌రం స‌హ‌కరించుకుందాం అని కోరింది. క‌ట్ చేస్తే కంగనా తాజాగా ఓ వీడియో విడుద‌ల చేసింది.

మీడియా వ‌ర్గాల‌కి నేను ఒక‌టి చెప్ప‌ద‌ల‌చుకున్నాను. నా కెరీర్‌కి మీడియా చాలా స‌పోర్ట్‌గా నిలిచింది. మీడియాలో నాకు చాలా మంచి స్నేహితులు ఉన్నారు. నా విజ‌యంలో వారి హ‌స్తం కూడా ఉంది. వారికి నేను ఎల్ల‌ప్పుడు రుణ‌ప‌డి ఉంటాను. అయితే కొన్ని మీడియా వ‌ర్గాలు మాత్రం దేశాన్ని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నారు. ప‌దో త‌ర‌గ‌తి ఫెయిలైన వాళ్ళు మీడియా అని చెప్పుకుంటున్నారు. వీరి మ‌న దేశం శిక్షించ‌లేదు. వారికి దేశం పైన భ‌క్తి ఉండ‌దు కాని , నాకు లేదని చెబుతుంటారు. ప‌ర్యావ‌ర‌ణం దినోత్సవం రోజున అవ‌గాహన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నేను, జంతు సంర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన ప్ర‌చారంలోను పాల్గొన్నాను. వీటిపై ఓ విలేక‌రి జోకులు వేస్తూ క‌థ‌నం ప్ర‌చురించాడు. ఇలాంటి వాళ్లనా విలేక‌రులు అనేది.

ఓ విలేకరి నేను చేసిన మ‌ణిక‌ర్ణిక సినిమా గురించి తప్పుగా రాశాడని నిల‌దీసాను. దాంతో ఆయ‌న‌కి స‌పోర్ట్‌గా మ‌రో న‌లుగురు నాపై అరిచారు. న‌న్ను నిషేదించాల‌ని, సినిమాల‌లోకి తీసుకోవ‌ద్ద‌ని కేక‌లు వేశారు. ఇలాంటి వాళ్ళు ఇండ‌స్ట్రీని ఏలితే నేను ఈ రోజు టాప్ రేంజ్‌లో ఉండేదానిని కాదు క‌దా. మీ అందరిని ఒక్కటే అడుగుతున్నాను. ద‌యచేసి నన్ను నిషేదించండి. నాకు సంబంధించిన వార్త‌లు మీ కుటుంబానికి ఆస‌రాగా ఉండ‌కూడ‌దు అంటూ కంగాన వీడియోలో పేర్కొంది. కంగనా చెప్పిన మాట‌ల‌కి సంబంధించిన వీడియోని ఆమె సోద‌రి రంగోలి సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది.2768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles