దొర‌సాని నుండి క‌ప్ప‌తల్లి.. క‌ప్ప‌త‌ల్లి లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

Thu,July 4, 2019 10:11 AM
Kappathalli Full Lyrical song released

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్, రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కించిన చిత్రం దొర‌సాని . నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఎంతో రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూలై 12న విడుద‌ల కానుంది. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. రాజుగా ఆనంద్ , దొర‌సానిగా శివాత్మిక ఎంతో మెచ్యూర్డ్‌గా న‌టించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్ని కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా చిత్రం నుండి క‌ప్ప‌త‌ల్లి.. కప్ప‌త‌ల్లి అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేశారు. ఇందులోని లిరిక్స్ మ‌న హృద‌యానికి హ‌త్తుకునేలా ఉన్నాయి. గోరెటి వెంక‌న్న ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, అనురాగ్ కుల‌క‌ర్ణి ఈ పాట‌ని ఆల‌పించారు. మీరు ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.

1589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles