క‌రణ్ జోహార్ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం..భారీగా ఆస్తి న‌ష్టం

Wed,May 1, 2019 12:38 PM
Karan Johars Dharma Productions Godown Gutted by Fire

బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌ల‌లో క‌ర‌ణ్ జోహార్ ఒక‌రు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై అనేక హిట్ చిత్రాలు నిర్మించారు క‌ర‌ణ్‌. ఆయ‌న స్టూడియోలోని గోడౌన్‌లో మంగ‌ళ‌వారం భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో భారీ ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్టు చెబుతున్నారు. కొన్నేళ్ళుగా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌కి సంబంధించిన జ్ఞాప‌కాలు, విలువైన సంప‌ద‌,వెల క‌ట్ట‌లేని వ‌స్తువులన్ని అగ్నికి ఆహుత‌య్యాయ‌ట‌. దీంతో క‌రణ్ జోహార్ తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

క‌ర‌ణ్ జోహార్ తండ్రి య‌ష్ జోహార్ 1976లో తూర్పు గోరేగావ్‌లోని కామా ఇండ‌స్ట్రీయ‌ల్ ఎస్టేట్‌లో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ని ప్రారంభించారు. 18 వేల చద‌ర‌పు అడుగులు ఉన్న ఈ స్టూడియోలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమాల‌కి సంబంధించిన పుస్తకాలు, వస్తువులు, స్క్రిప్టులు, షూటింగ్ ప‌రిక‌రాలని ఉంచారు. తాజాగా జ‌రిగిన అగ్ని ప్రమాదంలో అవ‌న్నీ మంట‌ల‌లో కాలిపోయిన‌ట్టు చెబుతున్నారు. 80వ దశకం నుంచి రూపొందించిన సినిమా మెమొరీస్ ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయట‌.

సెట్స్ పై ఉన్న సినిమాలు, త‌దుపరి సినిమాల‌కి సంబంధించిన ప్రాపర్టీలు, స్క్రిప్టులు, విలువైన వస్తువులు కూడా మంటల్లో కాలిపోయాయ‌ని అంటున్నారు. ఎక్కువగా కాస్ట్యూమ్స్‌, సినిమా సెట్టింగ్‌లకు వినియోగించే వస్తువులు ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయని భావిస్తున్నారు. డ‌బ్బుప‌రంగానే కాకుండా ఎన్నో జ్ఞాప‌కాలు, వెలక‌ట్ట‌లేని వ‌స్తువులు అగ్నికి ఆహుతి కావ‌డాన్ని సంస్థ నిర్వాహ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. కోట్ల‌లోనే ఆస్తి న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. తెల్ల‌వారు జామున 2 గంట‌ల ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్టుగా చెబుతున్నారు. లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ ముంబైలోని చెంబూర్‌లో నిర్మించిన ఆర్కే స్టూడియోలోను ఇలాంటి అగ్ని ప్ర‌మాద‌మే చోటు చేసుకుంది.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles