ఇప్పుడు మ‌ణిక‌ర్ణికని టార్గెట్ చేస్తున్న క‌ర్ణిసేన‌

Fri,February 9, 2018 09:49 AM
karni sena supports to the sbm

క‌ర్ణిసేన‌.. ఈ పేరు ప‌ద్మావ‌త్ చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. త‌మ త‌ల్లి రాణి ప‌ద్మావ‌తి చ‌రిత్ర‌ని వ‌క్రీకరిస్తున్నార‌ని పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, విధ్వంసం చేయ‌డంతో క‌ర్ణిసేన సంఘం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ప‌ద్మావ‌త్ సినిమా రిలీజ్‌కి ముందు బీభ‌త్సం సృష్టించిన కర్ణిసేన రీసెంట్‌గా మూవీని చూసి, మేము గ‌ర్వ‌ప‌డేలా సినిమా తీసారని స్టేట్‌మెంట్ ఇచ్చింది. క‌ట్ చేస్తే ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న మ‌ణిక‌ర్ణిక‌ని వారు టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. మ‌ణిక‌ర్ణిక చిత్రం ఝాన్సీ లక్ష్మీబాయి కథతో తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ చరిత్రను వక్రీకరించారంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు(ఎస్‌బీఎం) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సర్వ బ్రాహ్మణ మహా సభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. జై మిశ్రా రాసిన వివాదాస్ప‌ద పుస్తకం రాణీ ఆధారంగా మ‌ణిక‌ర్ణిక తెర‌కెక్కిస్తున్నార‌నే అనుమానం క‌లుగుతుంది . ఝాన్సీ ల‌క్ష్మీ బాయ్‌కి, బ్రిటీష్ వ్య‌క్తికి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు తీసి చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రిస్తే అస్సలు ఊరుకునేదే లేదంటూ స‌ర్వ బ్రాహ్మ‌ణ మ‌హాస‌భ స‌భ్యులు ఆరోపించారు. దీనిపై ప్ర‌భుత్వం నుండి ఎలాంటి స్పంద‌న లేదంటూ తాజాగా ఎసీబీ ఎం అధ్య‌క్షుడు సురేష్ మిశ్రా మీడియాతో అన్నారు. దీంతో వెంట‌నే ఎస్‌బీఎంకు మద్దతుగా తాము ఉంటామని కర్ణిసేన స్థాపకుడు లోకేంద్ర సింగ్‌ కల్వి స్టేట్ మెంట్ ఇచ్చారు . బ్రాహ్మణులకు ఇబ్బందులు ఎదురైతే రాజ్‌పుత్‌లు ఊరుకోరని స్పష్టంచేశారు. బాహుబ‌లి ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మ‌ణిక‌ర్ణిక‌ చిత్రానికి క‌థ అందిస్తుండ‌గా, మూవీని ఆగ‌స్ట్ 3న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles