నిఖిల్, స్వాతి కాంబినేష‌న్‌లో చందూ మొండేటి చిత్రం

Fri,April 19, 2019 10:02 AM
Karthikeya combination for sequel

నిఖిల్, స్వాతి కాంబినేష‌న్‌లో చందూ మొండేటి తెర‌కెక్కించిన చిత్రం కార్తికేయ‌. థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. కార్తికేయ 2 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. కార్తికేయ చిత్రం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండి మరలా కథను మొదలు పెట్టి కొత్తగా కథను ప్రెజెంట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్న‌ట్టుగా తెలుస్తుంది. కాగా కార్తికేయలో హీరోయిన్ గా నటించి అల‌రించిన కలర్స్ స్వాతి.. ‘కార్తికేయ 2’లోనూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కలర్స్ స్వాతితో పాటు సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందట. మొత్తానికి కలర్స్ స్వాతి పెళ్ళి త‌ర్వాత‌ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. అయితే చందూ మొండేటి తెర‌కెక్కించిన చివ‌రి చిత్రం స‌వ్య‌సాచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌గా, కార్తికేయ సీక్వెల్‌తో మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు .

1408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles