కార్తీకేయ ‘హిప్పీ’ టీజర్ వచ్చేసింది

Wed,March 20, 2019 05:55 PM
Karthikeya Come out with Hippi movie teaser

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ‌ నటిస్తోన్న చిత్రం హిప్పీ. టిఎన్ కృష్ణ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ‘ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో దాన్ని పట్టుకున్నారు..అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు తెలుసా..’అని కమెడియన్ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్స్ తో హిప్పీ టీజర్ ప్రారంభమవుతుంది. బాక్సర్ గా కార్తికేయ తన ప్రత్యర్థిపై పంచ్ లు విసురుతున్నాడు. టీజర్ చూస్తుంటే కార్తీకేయ ఓ వైపు లవర్ బాయ్ గా, మరోవైపు బాక్సర్ గా అభిమానులకు వినోదాన్ని అందించనున్నాడని తెలుస్తోంది.

క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ తెరకెక్కుతోంది. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతుంది. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీత దర్శకుడు కాగా..దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ కార్తీకేయకు జోడీగా నటిస్తున్నారు.

1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles