నాని చిత్రంలో విల‌న్‌గా ఆర్ఎక్స్ 100 హీరో..!

Tue,February 19, 2019 11:15 AM
Kartikeya Quite Excited To Work With Natural Star

నేచుర‌ల్ స్టార్ నాని- క్రేజీ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ నిన్న అఫీషియ‌ల్‌గా లాంచ్ కాగా, నేటి నుండి చిత్రీక‌ర‌ణ నిర్విరామంగా జ‌రుగనుంద‌ని తెలుస్తుంది. అయితే చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విల‌న్ పాత్ర‌లో పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. త‌న‌కి చిత్రంలో మంచి రోల్ ఇచ్చినందుకు విక్ర‌మ్ కుమార్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కార్తికేయ త‌న పాత్ర‌కి 100 శాతం న్యాయం చేస్తాన‌ని అన్నాడు. ఈ సినిమా ద్వారా విక్ర‌మ్ కుమార్, నాని నుండి ఎంతో నేర్చుకునే అవ‌కాశం త‌న‌కి దొరికింద‌ని కార్తికేయ త‌న ట్వీట్‌లో తెలిపాడు. ఐదుగురు హీరోయిన్స్ ఈ చిత్రంలో న‌టిస్తార‌ని తెలుస్తుండ‌గా వారిలో కీర్తి సురేశ్, ప్రియా ప్రకాశ్ వారియర్, మేఘా ఆకాశ్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మ‌రో ఇద్ద‌రు ఎవ‌రో తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌కురువిళ్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.1271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles