90 ఎంఎల్‌తో కిక్కిచ్చిన కార్తికేయ‌- ట్రైల‌ర్

Thu,November 21, 2019 10:53 AM

యంగ్ హీరో కార్తికేయ ప్ర‌ధాన పాత్ర‌లో శేఖ‌ర్ రెడ్డి ఎర్రా తెర‌కెక్కిస్తున్న చిత్రం 90ఎంఎల్. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌లో వస్తున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. . అలీ, పోసాని, రావురమేష్, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్రమోష‌న్ స్పీడ్ పెంచారు. ఇటీవ‌ల‌ ‘సింగిలు.. సింగులు.. సింగులు సింగారానివే.. నువ్వు! నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే’ అంటూ సాగిన పాట‌ని విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాలు పెంచిన మేక‌ర్స్ తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచారు . ట్రైల‌ర్ చూస్తుంటే ఇందులో అన్ని అంశాల‌తో కూడిన వినోదం ఉన్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. మందు లేకుండా క్ష‌ణం కూడా ఉండ‌లేని వ్య‌క్తిగా కార్తికేయ అల‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. నేహా సోలంకి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles