అక్ష‌య్‌కి జోడీగా క‌త్రినా.. పెరిగిన అంచ‌నాలు

Mon,April 22, 2019 10:51 AM

బాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్న హీరో అక్ష‌య్ కుమార్. ఆయ‌న చివ‌రిగా న‌టించిన కేస‌రి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పవర్ ఫుల్ మాస్, కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి డైరెక్ష‌న్‌లో సూర్య‌వంశీ అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో అక్ష‌య్ కుమార్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించి సంద‌డి చేశాడు . 2020 ఈద్ కానుక‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.


గ‌తంలో రోహిత్ శెట్టి .. కాప్ డ్రామా నేప‌థ్యంతో సింగం సిరీస్, సింబా అనే చిత్రాలు చేశాడు. ఈ చిత్రాలు బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు అక్ష‌య్ చేస్తున్న సూర్య‌వంశీ అనే కాప్ డ్రామా చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇది కాప్ డ్రామా సిరీస్‌లో నాలుగో చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సూర్య‌వంశీ చిత్రాన్ని రోహిత్ శెట్టి - క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో క‌థానాయిక‌లుగా క‌త్రినా కైఫ్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేస్తార‌ని అన్నారు. తాజాగా సూర్య‌వంశీ గార్ల్ క‌త్రినా కైఫ్ అంటూ చిత్ర యూనిట్ ప్ర‌కటించింది. అంటే చిత్రంలో అక్ష‌య్ స‌ర‌స‌న క‌త్రినా కైఫ్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. 9 ఏళ్ల త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సంద‌డి చేయ‌నుండ‌డం విశేషం.

1043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles