కత్రినా మాల్దీవులు ట్రిప్..ఫొటోలు వైరల్

Mon,April 8, 2019 04:47 PM
Katrina Kaif vacation pics in Maldives goes viral


షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉండే కత్రినాకైఫ్..సమ్మర్ వెకేషన్‌లో భాగంగా మాల్దీవులు టూర్‌కు వెళ్లింది. మాల్దీవులు ఐలాండ్ తీరంలోని అందమైన లొకేషన్లలో స్నేహితులతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది కత్రినా. మాల్దీవుల నుంచి తిరిగొచ్చిన తర్వాత..టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కత్రినా. ‘పైన ఆకాశం..కింద ఇసుక..లోపల ప్రశాంతం’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

కత్రినా తన మేకప్ ఆర్టిస్ట్ డానియల్ బవుయెర్, సెలబ్రిటీ ఫిట్‌నెస్ శిక్షకుడు యాస్మిన్ కరాచీవాలాతోపాటు మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లింది. మాల్దీవులు బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న కత్రినా ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కత్రినా, సల్మాన్‌ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భారత్..ఈద్‌కు విడుదల కానుంది.




2333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles